పొంగులేటి, తుమ్మల జిత్తులమారి నక్కలు
ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావునే. కేసీఆర్ ఈ సందర్భంగా చిన్నయసూరి రాసిన కరటక దమనకులనే నీతి కథను ప్రస్తావించారు.
- చిన్నయసూరి కథలో కరటక దమనకులు అనే నక్కలు వీళ్లే..
- వారి నటనకు ఆస్కార్ అవార్డులూ తక్కువే..
- ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ వాళ్లని పోల్చిన విధానం అక్షర సత్యం
- విలేకర్ల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావునే. కేసీఆర్ ఈ సందర్భంగా చిన్నయసూరి రాసిన కరటక దమనకులనే నీతి కథను ప్రస్తావించారు. ఆ కథ రెండు గుంట నక్కల జిత్తుల గురించి. ఆ నకలు తమ నటనతో ఎలాంటి వారినైనా మోసం చేస్తాయి. పొంగులేటి, తుమ్మల కూడా అలాంటి నేతలే. వారి నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పోటీ చేసిన తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోవడానికి కారణం వారిద్దరే..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మల ఎన్నికల్లో గెలవడం కోసం తనను వ్యక్తిగతంగా దూషిస్తూ దిగజారుతున్నారన్నారు. తాను చేపట్టిన అభివృద్ధి పనులను కూడా తుమ్మల తన ఖాతాలో వేసుకోవడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిజమని తేలినా తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. తన ఆస్తిపాస్తులను ఖమ్మం ప్రజలకు రాసిస్తానన్నారు.
ఈ ఏడాది జనవరి 18న నూతన కలెక్టరేట్ సమీపంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భూమి ఈనినట్లుగా జనం వచ్చారని, ఇదే స్థాయిలో ఆదివారం ఖమ్మంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు అలాగే వచ్చారన్నారు. ప్రజలు బారికెడ్లు నెట్టుకుని మరీ సభ లోపలికి వచ్చారన్నారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉభయ జిల్లాకేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన రెండు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయన్నారు. కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసిందని కొనియాడారు. ప్రజలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఎన్నికల్లో గెలిపించాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు వచ్చే వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నాని మండిపడ్డారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ డోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముఖ్యనాయకులు ఆర్జేసీ కృష్ణ, జహీర్ ఆలీ, ఖమర్, తాజుద్దీన్, శీలంశెట్టి వీరభద్రం, ఆకుల మూర్తి, డోకుపర్తి సుబ్బారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

