అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ
ఆధ్యాత్మిక దినోత్సవ వేళ భక్తిభావం వెల్లివిరిసింది. సర్వమతాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించాయి. భగవంతుడి ఆశీర్వచనాలు అందజేశాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది.
- ఉభయ జిల్లాల్లో జోరుగా దశాబ్ది ఉత్సవాలు
- గుడి, చర్చి, మసీదుల్లో ప్రజాప్రతినిధుల పూజలు, ప్రార్థనలు
ఆధ్యాత్మిక దినోత్సవ వేళ భక్తిభావం వెల్లివిరిసింది. సర్వమతాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించాయి. భగవంతుడి ఆశీర్వచనాలు అందజేశాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. అర్చకులు, ఇమామ్‌లు, దైవ సందేశకులు ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. వారిని పూజారులు, మత గురువులు ఆశీర్వదించారు.
– ఖమ్మం, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. ఖమ్మం నగరంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, గుడ్ షెపర్డ్ చర్చి, నగర పరిధిలోని ఓ మజీద్‌లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు, ప్రార్థన చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. కూసుమంచి, నేలకొండపల్లి వేడుకల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి, కల్లూరు వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిర వేడుకలో ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.

ప్రతి వేద పాఠశాలకు ఆలంబనగా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు. ప్రతి జిల్లాకేంద్రంలో బ్రాహ్మణ భవనాల నిర్మాణానికి రూ.75 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు. క్రిస్టమస్ పండుగకు క్రైస్తవులకు క్రిస్మస్ కానుక, రంజాన్ పండుగకు ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ అందిస్తున్నామన్నారు. అలాగే ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, వైరా కోదండ రామస్వామి ఆలయం, జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం, సత్తుపల్లి నీలాదీశ్వరస్వామి ఆలయంలో అర్చకులు రుద్రాభిషేకం, సుదర్శన హోమం నిర్వహించారు. ఖమ్మంలో భక్తబృందం గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి వాసవి గార్డెన్స్ వరకు శోభాయాత్ర జరిగింది. అనంతరం అర్చకులు వాసవి గార్డెన్స్‌లో శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
– ఖమ్మం, జూన్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

