దశాబ్ది.. అదుర్స్
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఘనంగా జరిగాయి.
- ముగిసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడ్రోజులు అంబరాన్నంటిన సంబురాలు
- గులాబీజెండాలతో గుబాళించిన ‘తెలంగాణభవన్’
- జాతీయజెండా, పార్టీ జెండాలను ఎగురవేసిన బీఆర్ఎస్ శ్రేణులు
- ఉద్యమకారులకు ఘనంగా సన్మానాలు.. అమరవీరులకు నివాళులు
- తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌ది పేగుబంధం
- బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
- పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం..
- సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం, జూన్ 3 : బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆ పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్)లో సోమవారం ముగింపు వేడుకలు అదిరిపోయాయి. జాతీయజెండాను ఎమ్మెల్సీ తాతా మధు ఎగురవేయగా, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఉద్యమకారుడు తవిడిశెట్టి రామారావు ఎగురవేశారు. అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తాతా మధు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో మాజీ సీఎం కేసీఆర్‌ది పేగుబంధం అని, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఢిల్లీ పెత్తందారుల మెహర్బానీతో కాదని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు వచ్చాయన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎకుపెట్టిన రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్నివిధాలుగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తున్నదన్నారు. రాష్ట్ర రాజముద్ర మార్చినా, తెలంగాణ గీతాన్ని మార్చినా ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తొలగించలేరన్నారు. అన్నిరకాల అవకాశాలు కల్పించిన కేసీఆర్‌ని, తల్లి లాంటి పార్టీని కష్టసమయంలో వదిలివెళ్లిన ఏ ఒకరిని తిరిగి పార్టీలో చేర్చుకునే సమస్యే లేదన్నారు. కేసీఆర్ కొనసాగించిన అభివృద్ధి, సంక్షేమాన్ని రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలుచేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని గెలిపించడం ఆ పార్టీ కోల్పోతున్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం వందలాది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటామన్నారు.
ఉద్యమకారులకు సత్కారం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పోరాటంలో భాగస్వాములై ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘనంగా సతరించారు.
హరీశ్‌రావు బర్త్ డే వేడుకలు..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎస్బీఐటీ విద్యాసంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మంరూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, తెలంగాణ ఉద్యమకారులు బిచ్చల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, నరేందర్, సతీశ్, ఉమాశంకర్, ఆసిఫ్, ఆఫ్టర్, కార్పొరేటర్లు దాదే అమృత, సతీశ్, మోతారపు శ్రావణి సుధాకర్, మక్బుల్, నాయకులు శీలంశెట్టి వీరభద్రం, మాటేటి నాగేశ్వరరావు, తోట రామారావు, తోట వీరభద్రం, కన్నం ప్రసన్న, రామ్మోహన్రావు, మెంటం రామారావు, వీరన్న, విజయ్, భారతి, సద్దాం, మాటేటి కిరణ్, దినేష్, సల్మా, మాధవి, షాకీర్, ముజాహిద్, షకీన, అబ్బాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

