గనులను సింగరేణికే కేటాయించాలి
రాష్ట్రంలో సిరులు కురిపించే బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో భద్రాద్రి జిల్లాకు చెందిన టీబీజీకేఎస్ నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
- రాజ్‌భవన్ ముట్టడిలో టీబీజీకేఎస్ నాయకులు
రామవరం/మణుగూరు టౌన్, జూలై 18 : రాష్ట్రంలో సిరులు కురిపించే బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో భద్రాద్రి జిల్లాకు చెందిన టీబీజీకేఎస్ నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, వాటిని సింగరేణికే కేటాయించే విధంగా ప్రత్యేక చట్టం తేవాలని కోరారు.
అనంతరం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ, రాంబాబు యాదవ్‌ల సారథ్యంలో ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ వైపు వెళ్లగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, టీఆర్‌కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, కిరణ్, నాగెలిల, బంగారి పవన్, జాఫర్, హుస్సేన్, బడితల సమ్మయ్య, అవినాశ్, నరేశ్, నేత కిరణ్‌తోపాటు కార్మిక సంఘాల నాయకులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

