గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశాంతం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో 75.28 శాతం, భద్రాద్రిలో 74.95 శాతం హాజరు నమోదైంది. ఖమ్మం జిల్లాలో మొత్త 52 పరీక్ష కేంద్రాల్లో 18,403 మంది అభ్యర్థులకు గాను 13,855 మంది హాజరయ్యారు.
- ఖమ్మంలో 75.28 శాతం, భద్రాద్రిలో 74.95 శాతం హాజరు
- హైదరాబాద్ నుంచి వచ్చిన టీజీపీఎస్సీ అబ్జర్వర్ల పర్యవేక్షణ
- పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్, భద్రాద్రి ఎస్పీ
- సెంటర్ల పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత.. 144 సెక్షన్ అమలు..
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం/ కొత్తగూడెం క్రైం, జూన్ 9: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో 75.28 శాతం, భద్రాద్రిలో 74.95 శాతం హాజరు నమోదైంది. ఖమ్మం జిల్లాలో మొత్త 52 పరీక్ష కేంద్రాల్లో 18,403 మంది అభ్యర్థులకు గాను 13,855 మంది హాజరయ్యారు. భద్రాద్రి జిల్లాలో 8,875 మంది అభ్యర్థులకుగాను 6,649 మంది మాత్రమే పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చి సమయం మించి పోవడంతో వెనుదిరిగిన అభ్యర్థులు కూడా ఎక్కుమందే ఉన్నారు. ఖమ్మంలోని పరీక్ష కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి జిల్లాలోని పరీక్ష కేంద్రాలను భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన టీజీపీఎస్సీ అబ్జర్వర్లు కూడా పరీక్షలను పర్యవేక్షించారు. ఎగ్జామ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు.
ఖమ్మంలో 4,548 మంది గైర్హాజరు..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పరీక్ష జరుగుతున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, క్రియేటివ్ హైసూల్, మౌంట్‌ఫోర్ట్ హైసూల్, సెయింట్ జోసఫ్ హైసూల్, కృష్ణ ప్రసాద్ మెమోరియల్ సూల్, హార్వెస్ట్ హైసూల్, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల్లోని ఎగ్జామ్ సెంటర్లను తనిఖీ చేసి పరీక్ష తీరును పరిశీలించారు. అభ్యర్థుల హాజరు వివరాలను ఆయా సెంటర్ల బయోమెట్రిక్ హాజరు వివరాల ద్వారా తెలుసుకున్నారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకోవాలని, సమయం తెలిసే విధంగా ప్రతి అరగంట సమయానికి బెల్ మోగించాలని, చివరి 30 నిమిషాలు ఉన్నప్పుడు అలారం బెల్ మోగించాలని సూచించారు. 4,548 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష ముగిసిన పరీక్ష అనంతరం కలెక్టరేట్ రిసెప్షన్ సెంటర్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో విజయ, ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు డాక్టర్ జాన్‌బాబు, రాజ్‌కుమార్ తదితర అధికారులకు హైదరాబాద్ నుంచి వచ్చిన టీజీపీఎస్సీ బాధ్యులు ప్రొఫెసర్ డాక్టర్ దుర్గారావు, ప్రవీణ్‌కుమార్ సంబంధిత పరీక్ష మెటీరియల్‌ను అందించారు.
భద్రాద్రి జిల్లాలో 2222 మంది గైర్హాజరు..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన కారణంగా ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎస్పీ రోహిత్‌రాజు సుజాతనగర్ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం 21 కేంద్రాల్లో 8,875 మంది అభ్యర్థులకుగాను 2,222 మంది గైర్హాజరయ్యారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. డీఎస్పీ రెహమాన్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాగా, జిల్లాలో గ్రూప్-1 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించామని, హాజరుశాతం 74.95 నమోదైందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, అబ్దుల్‌కలాం కాలేజీ సెంటర్లో పరీక్ష బందోబస్తు పరిశీలనకు వెళ్లిన ఎస్పీ రోహిత్‌రాజును కూడాఅక్కడి సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
ఖమ్మం రూరల్‌లో..
ఖమ్మం రూరల్, జూన్ 9: ఖమ్మం రూరల్ మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో కలిపి మొత్తం 349 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అన్ని కేంద్రాలకు చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థులకు కుటుంబ సభ్యులు సహాయకులుగా వచ్చారు. మహిళా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నంతసేపు వారు ఆయా పరీక్ష కేంద్రాల బయట ఉండి చిన్నారుల సపర్యలు చూసుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

