కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 27 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఏడాదిపాటు కష్టపడి చదివిన విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా.. ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు.
విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు.. భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేకంగా 14416 టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సలహాలు, సూచనల కోసం రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన 040-24601010, 040-24655027 నంబర్లకు కానీ.. జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన 79979 94366, 89199 61013, 94418 17478 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.