ఆటాడుకుందాం.. రా..
క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియాల నిర్మాణానికి పూనుకున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, చిన్నతనం నుంచే క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు, అన్ని ఆటల్లో శిక్షణ ఇచ్చేందుకు సింథటిక్ ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందుకు రూ.3.50కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న కల్లూరు జూనియర్ కళాశాల ఆవరణ వేదిక అయింది.
- కల్లూరులో రూ.3.50కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం
- నిధులు తెప్పించి.. త్వరితగతిన పనులు చేయించిన ఎమ్మెల్యే సండ్ర
- తెలంగాణ ప్రభుత్వ హయాంలో నెరవేరిన క్రీడాకారుల కల
- 29న క్రీడల శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్చే ప్రారంభం
కల్లూరు, ఏప్రిల్ 27 : క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియాల నిర్మాణానికి పూనుకున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, చిన్నతనం నుంచే క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు, అన్ని ఆటల్లో శిక్షణ ఇచ్చేందుకు సింథటిక్ ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందుకు రూ.3.50కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న కల్లూరు జూనియర్ కళాశాల ఆవరణ వేదిక అయింది. ఆ కోర్టులు ఆటాడుకుందా.. రా.. అని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని కల్లూరులో మినీ స్టేడియం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా కలెక్టర్, అధికారులను ఒప్పించి.. ఎప్పటికప్పుడు స్టేడియం పనులను పరిశీలిస్తూ నిర్మాణం పూర్తి చేయించారు. ఈనెల 29న క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ చేతులమీదుగా మినీ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులకు అంకితం చేయనున్నారు.
ఎన్నో ఏళ్ల కల…
1980 నుంచి క్రీడాకారులు, మండలవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టేడియం నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ హయాంలో నెరవేరడంతో యువకులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్లూరులోని ఈ మైదానంలోనే సాధన చేసిన ఎందరో క్రీడాకారులు.. రాష్ట్రస్థాయికి 2వేల మంది, జాతీయ స్థాయికి 100 మంది, అంతర్జాతీయ స్థాయికి ఐదుగురు ఎంపికై వివిధ క్రీడాంశాల్లో తమ సత్తా చాటారు. అదే గ్రౌండ్లో పోలీస్ ట్రైనింగ్ అభ్యర్థులు శిక్షణ పొంది ఐదుగురు ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 20 మంది పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున యువకులు, క్రీడాకారులు మైదానానికి చేరుకుని వాకింగ్, కబడ్డీ, వాలీబాల్ ఆడుతూ కఠోర శిక్షణ పొందుతున్నారు. స్టేడియం నిర్మాణం పూర్తి కావడంతో క్రీడాకారులకు మరిన్ని సేవలు అందనున్నాయి.
మినీ స్టేడియంలో సౌకర్యాలివీ..
కల్లూరులో పూర్తయిన మినీ స్టేడియంలో ఉడెన్ షటిల్ కోర్టులు రెండు, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టు, క్రికెట్ పిచ్, 420 మీటర్ల వాకింగ్ ట్రాక్, రబ్బర్ షీట్లతో ఇండోర్ కబడ్డీ కోర్టు, టేబుల్ టెన్నిస్, చదరంగం, ఓపెన్ జిమ్, క్రీడాకారులు దుస్తులు, ఇతర సామగ్రి భద్రపర్చుకునేందుకు లాకర్ సౌకర్యం, వాష్‌రూమ్స్‌ను సైతం ఏర్పాటు చేశారు.
మెరుగైన సౌకర్యాలు
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియం ఏర్పాటు చేయడం అభినందనీయం. స్టేడియం ఏర్పాటుతో ఔత్సాహిక క్రీడాకారులు ఆటల్లో రాణించేందుకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. స్టేడియంలో కబడ్డీ, బాస్కెట్‌బాల్, క్రికెట్‌తోపాటు ఓపెన్ జిమ్, వాకర్ల కోసం వాకింగ్ ట్రాక్ అధునాతనంగా ఏర్పాటు చేయడంతో శిక్షణ సులువు కానుంది.
– కండ్రాతి రాధాకృష్ణ, పీఈటీ, కల్లూరు
క్రీడాకారుల కల నెరవేరింది
తెలంగాణ ప్రభుత్వం కల్లూరులో రూ.3.50కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టడంతో క్రీడాకారుల కల నెరవేరింది. ఇదే మైదానం నుంచి శిక్షణ పొందిన యువకులు పోలీసులు, ఎస్సైలుగా, పీఈటీలుగా ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు అందనుండటంతో మరింతగా రాణిస్తారు. ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం శుభపరిణామంగా చెప్పొచ్చు.
– పసుపులేటి వీరరాఘవయ్య, పీఈటీ, కల్లూరు
వాకింగ్ ట్రాక్ శుభపరిణామం
కల్లూరులో మినీ స్టేడియం నిర్మా ణం పూర్తి చేసి వాకర్ల కోసం 420 మీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవారికి ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. వాకింగ్‌కు వచ్చిన వారు ఓపెన్ జిమ్‌లో సైతం వ్యాయామం చేసుకునేందుకు వీలు కల్పించడం మంచి పరిణామం. ఇక వాకర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
– బోసు భాస్కర్, వాకర్, కల్లూరు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

