కేసీఆర్ కృషితోనే సీతారామ ప్రాజెక్టు నీళ్లు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, నిరంతర కృషి ఫలితంగానే ప్రస్తుతం ఖమ్మం జిల్లా రైతులకు...
ఖమ్మం, జూలై 22 : సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, నిరంతర కృషి ఫలితంగానే ప్రస్తుతం ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నామంటే అది నాడు కేసీఆర్ ఆలోచించిన మహత్తర ప్రాజెక్టు కార్యరూపం దాల్చిన ఫలితమేనన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందడంతో రైతులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని, వ్యవసాయ రంగానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు కోసం సుమారు రూ.9 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాల్వలు, పంప్ హౌస్లు, పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని వివరించారు. అధిక సామర్థ్యం కలిగిన మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలు, భారీ పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, ఖమ్మం జిల్లా రైతుల భవిష్యత్ను మార్చే కీలకమైన ప్రాజెక్టు అని ఆయన అన్నారు. గతంలో వర్షాలపై ఆధారపడిన అనేక ప్రాంతాలకు ఇప్పుడు సాగునీటి భరోసా లభించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

