చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
మనిషి చనిపోయిన తర్వాత, ప్రశాంతంగా చివరి మజిలీ కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 25 వార్డులకు చెందిన ప్రజలు వాపోతున్నారు. గత కొద్ది నెలలుగా అనేక దఫాలుగా అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానిక ప్రజలు చివరికి...
– స్మశాన వాటికలో స్థానికుల నిరసన
– సర్కారు స్పందించాలని పార్టీ నాయకుల ఆవేదన
ఖమ్మం రూరల్, అక్టోబర్ 13 : మనిషి చనిపోయిన తర్వాత, ప్రశాంతంగా చివరి మజిలీ కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 25 వార్డులకు చెందిన ప్రజలు వాపోతున్నారు. గత కొద్ది నెలలుగా అనేక దఫాలుగా అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానిక ప్రజలు చివరికి అపరిశుభ్రంగా ఉన్న స్మశాన వాటిక స్థలంలో మంగళవారం నిరసనకు దిగారు. స్థానిక వార్డు కౌన్సిలర్లు కె.సత్యవతి, కె.నవీన్ లకు మొర పెట్టుకున్నారు. మండుటెండలో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు ఇకనైనా తమ అవస్థలను ఆలకించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు సుమన్ మాట్లాడుతూ.. నాయుడుపేట స్మశాన వాటికకు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. ఈ స్థలంలో వందలాది సమాధులు ఉన్నాయని, ప్రతి సంవత్సరీకం రోజున కుటుంబ సభ్యులు నివాళులు అర్పించేవారన్నారు. అయితే ఇటీవల కాలంలో తీగల వంతెన నిర్మాణం, ఆర్సీసీ వాల్ నిర్మాణం జరగడంతో స్మశాన వాటిక స్థలం కనుమరుగైందన్నారు.
దీనికి తోడు మున్సిపల్ అధికారులు చెత్తను సైతం డంపింగ్ చేయడంతో దుర్గంధం దుర్వాసన వెదజల్లుతుందన్నారు. ఇటీవల స్థానికులు కొందరు చనిపోయిన తరుణంలో అంత్యక్రియలు చేసుకునేందుకు అనువైన స్థానం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. వార్డు కౌన్సిలర్ గా గెలిపించినందుకు మాకు ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది నెలల క్రితం ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ స్థలం చూపెట్టడంతో పాటు, రూ.25 లక్షలతో స్మశాన వాటిక నిర్మాణం, కల్పన చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తున్న నేటి వరకు స్మశాన వాటిక పునరుద్ధరణ జరగలేదన్నారు.
రెండు వార్డులలో కలిపి పదివేల పైకి జనాభా ఉన్నారని, వార్డుల కు సంబంధించిన వ్యక్తుల మరణానంతరం అంత్యక్రియలు ఇక్కడే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మున్సిపాలిటీ ఏర్పాటు జరిగి సుమారు రెండు ఏండ్లు కావస్తున్న స్మశాన వాటిక ఏర్పాటు నోచుకోలేదని వాపోయారు. నాయుడుపేట పరిధిలో నూతన స్మశాన వాటిక ఏర్పాటు చేశామని చెబుతున్న అధికారులు, సంబంధం లేని సిద్దుల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఎలా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, జిల్లా ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ స్మశాన వాటిక ఏర్పాటు చేసి మూలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పలు వార్డుల ప్రజలు, పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- crematorium
- EMC
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

