పేదింటికి శుభకరి కల్యాణలక్ష్మి
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు భారమైన సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు.
- ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం సాయం
- స్వరాష్ట్రం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా అమలు
- నాటి సాయం రూ.50,000.. నేడు రూ.1,00,116కు పెంపు
- ఒక్క ఇల్లెందు నియోజకవర్గంలోనే 11,178 మంది లబ్ధిదారులు
- వారి ఖాతాల్లో రూ.107.47 కోట్లు జమ
పేదింట ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు తలకుమించిన భారం. ఆర్థిక వనరులు సమకూరక.. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు లేక.. బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేసి పెళ్లి ఖర్చుకు వినియోగించాల్సిన పరిస్థితి. మరికొందరు ఉన్న ఇళ్లు, భూములు తాకట్టు పెట్టి కట్నకానుకలు సమర్పించిన సందర్భాలు అనేకం. ఇక నుంచి ఏ తల్లిదండ్రులూ ఆడపిల్లల పెళ్లి విషయంలో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆటంకాలు లేకుండా పెద్దన్నలా నిలిచి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహ తంతు జరుగుతున్నంత సేపు ఆ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని మదిలో తలచుకుంటూ కూతురిని మెట్టినింటికి పంపిస్తున్నారు. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం నిర్విరామంగా కొనసాగుతోంది. 2014-23 వరకు ఇల్లెందు నియోజకవర్గంలోనే 11,178 మంది లబ్ధిదారులకు రూ.107.47 కోట్ల సాయం అందింది.
– ఇల్లెందు, సెప్టెంబర్ 27
ఇల్లెందు, సెప్టెంబర్ 27 : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు భారమైన సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు. సరిపడా ఆర్థిక వనరులతో ఆడపిల్లల పెళ్లి చేసి ఆత్మగౌరవంతో అత్తారింటికి సాగనంపేలా పథకానికి రూపకల్పన చేశారు. పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబాల్లో వివాహ కాంతులు నింపారు. 2014 అక్టోబర్ 2న ఈ పథకం ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో లబ్ధిదారుకు రూ.50,000 చొప్పున ఆర్థికసాయం అందేది. ఇప్పుడు ఆ సాయం రూ.1,00,116కు చేరింది. 2014-23 వరకు ఒక్క ఇల్లెందు నియోజకవర్గంలోనే 11,178 మందికి లబ్ధిదారులకు రూ.107.47 కోట్ల సాయం అందింది. సాయ అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద దిక్కు అయి ఆర్థిక సాయాన్ని అందించారని, ఆ సొమ్ముతో తమ కుమార్తెల పెళ్లిళ్లను ఆత్మగౌరవంతో చేయగలిగామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఇంటి పెద్ద లెక్క ఆదుకున్నాడు..
నా భర్త అఫ్జల్ కూలీ. పనికి వెళ్తేనే మా ఇల్లు గడుస్తుంది. మాకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. ఎలా పెళ్లి చేయాలా.. అని మదనపడ్డాం. అప్పటికే ఆర్థిక చిక్కుల్లో ఉన్నాం. షాదీముబారక్ పథకం ద్వారా ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం సొమ్ము ఇస్తుందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాం. కుమార్తెకు వివాహం చేశాం. తర్వాత అందిన షాదీముబారక్ సొమ్ముతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాం. అప్పుడు సీఎం కేసీఆర్ సార్ మాకు దేవుడిలా అనిపించారు. మా ఇంటి పెద్ద లెక్క అనిపించాడు.
– ఎస్కే యాసిన్, లబ్ధిదారు, ఇల్లెందు
ఆడపిల్లలకు కేసీఆర్ ఒక ధైర్యం..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలిచాయి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందిన సొమ్ము తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించింది. సీఎం కేసీఆర్ ఆడపిల్లలకు ఒక ధైర్యం. ఆడపిల్లల పెళ్లిళ్లంటేనే తల్లిదండ్రులు గబరా పడాల్సిన పరిస్థితి. ఒకవైపు బాలిక విద్యను ప్రోత్సహిస్తూ, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కేసీఆర్ భరోసానిస్తున్నారు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే నిరుపేదలకు ఎంతో అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
– బానోత్ హరిప్రియ, ఇల్లెందు ఎమ్మెల్యే
ఇద్దరు కుమార్తెలకు ఆర్థిక సాయం అందింది..
గతేడాది పెద్ద కుమార్తెకు వివాహం చేశాం. కల్యాణలక్ష్మి పథకంద్వారా మాకు ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం అందింది. ఈఏడాది రెండో కుమార్తె పెళ్లి చేశాం. మళ్లీ కల్యాణలక్ష్మి సొమ్ము అందింది. ఇద్దరి పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి సొమ్ము ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి పథకం లేకుంటే మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి చేయాలంటే కష్టంగా ఉండేది.
– శశిరేఖ, లబ్ధిదారు, కోయగూడెం, టేకులపల్లి మండలం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


