పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
- సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ జిల్లావ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం
సత్తుపల్లిటౌన్, జూన్ 5: ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరాఖాసీంసాహేబ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వడ్డి లావణ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్లూరి ఆడమ్స్, న్యాయవాదులు షేక్ బుజ్జిసాహేబ్, కృష్ణప్రసాద్, సెక్రటరీ రమేశ్, వెంకటకృష్ణ, సుదర్శనం, సాంబశివరావు, కోర్టు సూపరిండెంట్ బోయినపల్లి రవి, కోర్టు కానిస్టేబుల్ గిరి పాల్గొన్నారు.
సేంద్రియ పద్ధతుల్లో మొక్కలు పెంచాలి
- జడ్పీ డిప్యూటీ సీఈవో
ఖమ్మం, జూన్ 5: సేంద్రియ పద్ధతుల్లో మొక్కలను పెంచాలని జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, కేఎంసీ ఏఈ నవ్యజ్యోతి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై బుధవారం గ్రీన్‌వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమవుతుందని అన్నారు. గ్రీనరీని పెంచే వారి సంఖ్య తగ్గుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కూడా మొక్కలు పెంచాలని కోరారు. గ్రూప్ బాధ్యులు బత్తుల సరోజిని, మానుకొండ జ్యోతి, వాసిరెడ్డి నిర్మల, చిరుమామిళ్ల రాంబాబు, మందడపు సుధాకర్, ఇతర ప్రముఖులు బయ్యన బాబూరావు, రామిరెడ్డి, తారాబాయి, షేక్ కైసర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పర్యావరణంతోనే మానవాళి మనుగడ
కూసుమంచి(నేలకొండపల్లి), జూన్ 5 : పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని గ్రీన్ వే ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఆమోస్ అన్నారు. బుధవారం నేలకొండపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకు గుర్తుగా మొక్కలు నాటాలని దీనిని ఒక ఉద్యమంగా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కాసాని నాగేశ్వరరావు, కళాశాల సిబ్బంది రాజు, ఈదన్న విద్యార్థులు పాల్గొన్నారు. బుద్దారం గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అంగన్వాడీ పరిసరాల్లో సీడ్ బాల్స్‌ను తయారుచేసి వాటిని వేశారు. కార్యక్రమంలో ఏసీడీపీవో కనకదుర్గ, సూపర్వైజర్ పార్వతి, ప్రమీల, నాగమణి పాల్గొన్నారు.
‘ప్రియదర్శిని’లో పర్యావరణ దినోత్సవం
ఖమ్మంరూరల్, జూన్ 5 : మండలంలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి అధ్యాపకులు మొక్కలు నాటారు. చైర్మన్ కాట్రెపల్లి నవీన్‌బాబు మాట్లాడుతూ ప్రతిఏటా జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 దేశాల్లో పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. విరివిగా మొక్కలు నాటాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీ గోపాల్, అకాడమీ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, వివిధ విబాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్, పీవో పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిద్దాం : ఎఫ్‌డీవో
సత్తుపల్లి, జూన్ 5: పర్యావరణాన్ని ప్రతిఒక్కరూ కాపాడి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును కల్పిద్దామని ఎఫ్‌డీవో వీ మంజుల అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం వేంసూరు రోడ్డులోని నేలాద్రి అర్బన్ పార్క్‌లో మొక్కలు నాటారు. నేటి ఆధునిక సమాజంలో చెట్లు అంతరించిపోయి ఉష్ణోగ్రత పెరిగిపోతుందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఆర్వో స్నేహలత, బ్రహ్మకుమారి సేవాసంఘం సభ్యులు, అటవీ సిబ్బంది ఉన్నారు.
కిష్టారం ఓసీలో..
మండలంలోని కిష్టారం ఓసీలో పీవో ఎన్ నర్సింహారావు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఉద్యోగులందరూ తమవంతు పాత్ర పోషించాలని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అనంతరం ఉద్యోగస్తులతో ప్రపంచ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ రామకృష్ణ, ఇంజినీర్ వీరప్రసాద్, అడిషనల్ మేనేజర్ బాబు, పర్యావరణ అధికారి సూర్యప్రకాశ్, ఏఐసీటీయూసీ నాయకులు కిషోర్, ఐఎన్టీయూసీ నాయకులు అఫ్రోజ్, వెల్ఫేర్ ఆఫీసర్ విజయసందీప్ పాల్గొన్నారు.
ఖాన్ఖాన్పేటలో..
పెనుబల్లి, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలం ఖాన్ఖాన్పేటలో కల్లూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ స్కూల్లో ఐసీడీఎస్ ఏసీడీపీవో మహబూబ్అలీ, సూపర్వైజర్ భవానీ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అంగన్వాడీ టీచర్ జహీదాబేగం, అంగన్వాడీ చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’
ఖమ్మం వ్యవసాయం, జూన్ 5: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాల్సిన అవసరం ఉందని వర్తక సంఘం జాయింట్ సెక్రటరీ మన్నెం కృష్ణ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ బాధ్యులు కాసిన ఆనంద్ ప్రసాద్, కాటేపల్లి శైలజతో కలిసి నగరవాసులకు మొక్కలు, జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ మనుగడ మొత్తం వృక్షలతోనే ఆధారపడి ఉందన్నారు.
‘మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత’
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 5: పర్యావరణాన్ని పరిరక్షించడం, మొక్కలు నాటడం బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి విక్రమ్‌సింగ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని సెడార్ వ్యాలీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్, ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డి, స్కూల్ గౌరవ సలహాదారు బుగ్గవీటి ఉదయశ్రీ, ఆర్థోపెడిక్ వైద్యులు పీఎన్వీఎస్వీ ప్రసాద్, డాక్టర్ రావెళ్ల సంధ్యారాణి, ఫారెస్ట్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

