రెండో విడత తొలిరోజు మందకొడిగా..
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
- భద్రాద్రిలో సర్పంచ్ స్థానాలకు 25, వార్డులకు 46 నామినేషన్ల దాఖలు
- ఖమ్మం జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 36 నామపత్రాలు
- జిల్లాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు, కలెక్టర్లు
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం/ పాల్వంచ రూరల్, నవంబర్ 30: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి. భద్రాద్రి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 25, వార్డులకు 46, ఖమ్మం సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 36 నామపత్రాలు దాఖలయ్యాయి. రెండో విడత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో మంగళవారం వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. భద్రాద్రి జిల్లాల్లో రెండో విడత ఎన్నికల కోసం 1,392 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 3,902 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ విడతలో భద్రాద్రి జిల్లాలో 155 పంచాయతీలకు, 1384 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
భద్రాద్రిలో 48 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ..
జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 155 సర్పంచ్ స్థానాలకు, 1,384 వార్డులు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చండ్రుగొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 4, వార్డు స్థానాలకు 15; ములకలపల్లిలో సర్పంచ్ స్థానాలకు 2, వార్డులకు 3; అశ్వారావుపేటలో సర్పంచ్ స్థానాలకు 8, వార్డులకు 11; చుంచుపల్లిలో సర్పంచ్ స్థానాలకు ఒకటి, వార్డులకు 8, దమ్మపేటలో సర్పంచ్ స్థానాలకు 9, వార్డులకు 6, పాల్వంచలో సర్పంచ్ స్థానాలకు ఒకటి, వార్డులకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అన్నపురెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కానీ వార్డు స్థానాలకు మాత్రం 2 నామినేషన్లు వచ్చాయి. కాగా, అన్ని మండలాల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 25 నామినేషన్లు, వార్డు స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లాలో పర్యటించిన అధికారులు
రెండో విడత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని తొలిరోజు కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య పరిశీలించారు. పాల్వంచ మండలం కోడిపుంజులవాగు పంచాయతీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి నామిషన్ల పరిశీలనలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. చండ్రుగొండ మండలం రావికంపాడు, చండ్రుగొండ, దామరచర్ల, గానుగపాడు పంచాయతీలతోపాటు చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ, 3 ఇైంక్లెన్, 4 ఇైంక్లెన్ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య తనిఖీ చేశారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం తొలిరోజు ఆదివారం నామినేషన్లు స్వీకరించారు. ఆరు మండలాల్లోని 183 గ్రామాల్లో పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,686 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. కామేపల్లి 24 పంచాయతీలకుగాను 10 నామినేషన్లు, 218 వార్డులకు గాను 10 నామినేషన్లు; ఖమ్మం రూరల్‌లో 21 పంచాయతీలకుగాను 08, 202 వార్డులకు 03; కూసుమంచిలో 41 పంచాయతీలకుగాను 04, 364 వార్డులకు 09; ముదిగొండలో 25 పంచాయతీలకుగాను 09, 246 వార్డులకు గాకు 04; నేలకొండపల్లిలో 32 పంచాయతీలకు గాను 03, 300 వార్డులకు 04; తిరుమలాయపాలెంలో 40 పంచాయతీలకుగాను 11, 356 వార్డులకు గాను 06 చొప్పున నామినేషన్లు వచ్చాయి. మొత్తం 183 పంచాయతీ సర్పంచ్ స్థానాలకుగాను 45 నామినేషన్లు, 1,686 వార్డు స్థానాలకుగాను 36 నామినేషన్లు దాఖలయ్యాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

