సివిల్స్ ఫలితాల్లో ఐపీఎస్ సాధించిన సాయి అలేఖ్య
యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికైంది. సివిల్స్‌కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
బోనకల్లు, ఏప్రిల్ 16 : యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికైంది. సివిల్స్‌కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఐపీఎస్‌కు ఎంపికైన సాయి అలేఖ్యకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.
నాన్న కోరికను నెరవేర్చా : సాయి అలేఖ్య
చిన్ననాటి నుంచి బాగా చదివి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మా నాన్న చెబుతుండేవారు. పేపర్ కటింగ్‌లు నాకు తీసుకొచ్చి ఇచ్చి చదువుకోమని చెప్పేవారు. వాటిని చదివి నేను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకునే దానిని. ఇంటర్ పూర్తయిన తర్వాత బీటెక్ వైపు వెళ్లకుండా డిగ్రీ చదివాను. ఎంఏలో రూరల్ డెవలప్మెంట్ బెనారస్ ఇందు యూనివర్సిటీలో పూర్తి చేశాను. సివిల్స్ ప్రయత్నం చేశాను. నాన్న కోరికను నేను సాధించడం ఎంతో ఆనందం కలిగించింది. మా అమ్మ ఎప్పటికప్పుడు బాధ్యతలు గుర్తు చేస్తూ తన వెన్నంటే ఉంటూ ధైర్యాన్నిచ్చింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

