ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ భవన్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్‌లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా యువజన విభాగం నాయకులు తయారు చేయించిన భారీ కేక్‌ను ఆర్జేసీ కృష్ణ కట్ చేశారు. అనంతరం పలువురు నాయకులు ఆర్జేసీ కృష్ణను శాలువతో ఘనంగా సత్కరించారు.