జిల్లాకు చేరిన సైన్స్ మ్యూజియం పరికరాలు
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
- పాత డీఈవో కార్యాలయంలో అమర్చుతున్న అధికారులు
- గంగాప్రసాద్ బిర్లాకు రూ.38 లక్షల చెల్లింపులు పూర్తి
- పరికరాల అమరికను పర్యవేక్షిస్తున్న డీఈవో, డీఎస్ఏవో
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 8: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్ని శాఖల కార్యాలయాలు నూతన కలెక్టరేట్‌లోకి తరలిపోవడంతో జిల్లా విద్యాశాఖకు చెందిన పాత కార్యాలయ భవనాన్ని సైన్స్ మ్యూజియం నిర్వహించేందుకు కేటాయించారు. ఈ భవనంలో సైన్స్ మ్యూజియం నిర్వహించేందుకు అనువుగా మార్పులు చేర్పులు చేశారు. గత ప్రభుత్వాలు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా సైన్స్ మ్యూజియం నెలకొల్పేందుకు మొదటి విడతగా రూ.20 లక్షలు, రెండో విడతగా రూ.10 లక్షలు విడుదల చేశాయి. ఈ నిధులను డీఆర్వో, డీఎస్వో జాయింట్ అకౌంట్లో ఉంచారు. ఈ నిధులు 2014 నుంచి ఇప్పటి వరకు వడ్డీతో కలిపి రూ.46 లక్షలై అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే సైన్స్ పరికరాల కోసం వినియోగించి మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
27 రకాల సైన్స్ పరికరాలు..
సైన్స్ మ్యూజియంలో సైన్స్ పరికరాలను అమర్చేందుకు గంగా ప్రసాద్ (జీపీ) బిర్లా సంస్థ ప్రతినిధులను జిల్లా అధికారులు సంప్రదించారు. 6 నుంచి 10 తరగతుల వరకు గల సైన్స్ సబ్జెక్టుల్లోని పాఠాల్లో అవసరమైన సైన్స్ మ్యూజియంలో అమర్చేందుకు వివరాలను అందించారు. విద్యాశాఖ అధికారులు వాటిని ఆమోదించి టెండర్‌ను ఖరారు చేశారు. దీనిలో భాగంగా సోమవారం జీపీ బిర్లా సంస్ధ ప్రతినిధులు సైన్స్ మ్యూజియంలో ఉంచాల్సిన పరికరాలను జిల్లాకు చేర్చారు. వీటిని సైన్స్ మ్యూజియంలోని మొదటి అంతస్తులో అమర్చుతున్నారు. 27 రకాల సైన్స్ పరికరాలను సంస్థ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి కేటాయించిన స్థానంలో అమర్చుతున్నారు.
రూ.38 లక్షల చెల్లింపులు పూర్తి..
సైన్స్ పరికరాల కోసం కేటాయించిన రూ.40 లక్షల్లో రూ.38 లక్షలను జీపీ బిర్లా సంస్థకు విద్యాశాఖాధికారులు చెల్లించారు. పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షలను సైన్స్ మ్యూజియం అందుబాటులోకి వచ్చిన తర్వాత చెల్లించనున్నారు. సైన్స్ మ్యూజి యం కోసం కేటాయించిన భవనంలో మార్పులు చేసినందుకు రూ.16.50 లక్షలు కేటాయించారు. వాటి చెల్లింపులను సైతం పూర్తి చేశారు. మ్యూజియానికి సీఎస్ఆర్ ఫండ్స్ కింద నివోసాల్ సంస్థ రూ.20 లక్షలను డోనేషన్‌గా అందించింది.
పర్యవేక్షిస్తున్న డీఈవో, డీఎస్వో..
సైన్స్ మ్యూజియంలో జరుగుతున్న పనులను డీఈవో సోమశేఖరశర్మ, డీఎస్వో జగదీశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల చివరికల్లా పూర్తిస్థాయిలో అన్ని పరికరాలనూ అమర్చి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సైన్స్‌కి సంబంధించిన కార్యక్రమాలను సైన్స్ మ్యూజియం వేదికగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

