పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన ఎంపీకి రైల్వేస్టేషన్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు, రైల్వే అధికారులు గజమాల వేసి ఘనస్వాగతం పలికారు.
- ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
కొత్తగూడెం అర్బన్, జూలై 14: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన ఎంపీకి రైల్వేస్టేషన్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు, రైల్వే అధికారులు గజమాల వేసి ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల గురించి ఎంపీకి అధికారులు వివరించారు. ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని, భద్రాచలం రైల్వేస్టేషన్ నుంచి గతంలో రైద్దెన పలు రైళ్లను పునరుద్దరించాలని కోరారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ విశ్వనాథ్, రైల్వే అధికారులు రాం భజన్ వీణ, పాషా, రాజారెడ్డి, ఎండీ ఇర్ఫాన్, ఎండీ జావీద్, జేమ్స్ పాల్, ఖాజా బాబా, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఆళ్ల మురళి, కోనేరు సత్యనారాయణ, నాగ సీతారాములు, గోపాలరావు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెంలో విలేకరుల సమావేశంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా ఖమ్మం ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, టీపీసీసీ మెంబర్ నాగ సీతారాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, గోపాల్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

