రైతుల గుండెల్లో కేసీఆరే రారాజు
భూతల్లిని నమ్ముకున్న రైతన్నల గుండెల్లో సీఎం కేసీఆర్ రారాజుగా నిలిచిపోయారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆ తరువాత అన్నదాతలకు ఆయన మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తారని అన్నారు.
- వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవుతారు
- అన్నదాతలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తారు
- తల్లాడ ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటవీరయ్య
తల్లాడ, నవంబర్ 25: భూతల్లిని నమ్ముకున్న రైతన్నల గుండెల్లో సీఎం కేసీఆర్ రారాజుగా నిలిచిపోయారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆ తరువాత అన్నదాతలకు ఆయన మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తారని అన్నారు. తల్లాడ మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులు సంభాని చంద్రశేఖర్, కొండూరు సుధాకర్‌లతో కలిసి రంగంబంజర, మల్సూరుతండా, పాతమిట్టపల్లి, గాంధీనగర్‌తండా, గొల్లగూడెం, మంగాపురం, రెడ్డిగూడెం, పినపాక, కేశవాపురం, ముద్దునూరు, కుర్నవల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకలు ఎన్ని కుతంత్రాలు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని అన్నారు. యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సీఎం కేసీఆర్ సంకల్పానికి భగవంతుడు అందించిన ఆశీర్వాదమని అన్నారు.
అసలు ప్రపంచంలోనే అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూ రైతు బాంధవుడిగా నిలిచిన ముఖ్యమంత్రి.. కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మూడోసారి కూడా కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారని అన్నారు. ఎన్నికలు పూర్తయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. తల్లాడ మండలంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాయల వెంకటశేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, మాలోతు కల్యాణి, బద్ధం నిర్మల, తేలపుట్ల స్వరాజ్యం, అయిలూరి లక్ష్మి, చింతల రేణుక, తూము శ్రీనివాసరావు, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, వజ్రాల రామిరెడ్డి, తూము వీరభధ్రరావు, దూపాటి నరేష్‌రాజు, శీలం శ్రీనివాసరెడ్డి, కట్టా రాము, అయిలూరి శివారెడ్డి, పోతురాజు వెంకటయ్య, జీవీఆర్, దిరిశాల దాసురావు, జొన్నలగడ్డ కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

