HomeKhammamMinister Puvvada Ajaykumar Reached Kalwoddu In The City Morning And Inspected The Previous Day
మున్నేరు తగ్గుముఖం
మొన్నటి వరకు ఖమ్మం వద్ద ఉధృతంగా ప్రవహించిన మున్నేరు క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టి ముంపు బాధితులకు ఊరటనిచ్చింది.
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అజయ్‌కుమార్
ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశం
మొన్నటి వరకు ఖమ్మం వద్ద ఉధృతంగా ప్రవహించిన మున్నేరు క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టి ముంపు బాధితులకు ఊరటనిచ్చింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం ఉదయం నగరంలోని కాల్వొడ్డుకు చేరుకుని మున్నేటిని పరిశీలించారు.
ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ఉన్నారు.