బాధితులకు భరోసా..
‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన గోదావరి వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు
- అధైర్యపడకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది
- నష్టపోయిన వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు
- వరదలు తగ్గాక పారిశుధ్య చర్యలు చేపడతాం..
- భద్రాద్రి పర్యటనలో మంత్రి అజయ్‌కుమార్
వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.10 వేలను అందజేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో గోదావరి వరదతో ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భద్రాచలంలోని ముంపు కాలనీలు, కరకట్ట, మిథిలా స్టేడియం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని వరద బాధితులను ఓదార్చారు. ముంపు తగ్గాక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారని, వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, జూలై 22: ‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన గోదావరి వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భద్రాచలంలోని ముంపు కాలనీలు, కరకట్ట, మిథిలా స్టేడియం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికీ తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలను అందజేస్తోందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు.
అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, ఎస్పీ వినీత్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ పరిహారం, నిత్యావసర వస్తువులు అందజేస్తామని తెలిపారు. ముంపు కుటుంబాల గణన లెక్కింపులో సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఖమ్మం కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఏఎస్పీ రోహిత్‌రాజ్ నిమగ్నమయ్యారని అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

