– ఎంపీ రఘురామిరెడ్డికి వినతి
మధిర, ఆగస్టు 15 : మధిర రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డికి డాక్టర్ రాంబాబు, మోదుగు సైదులు శుక్రవారం ఖమ్మంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధిర రైల్వే స్టేషన్ ఇప్పటివరకు సికింద్రాబాద్ జోన్ డివిజన్లో ఉండేదన్నారు. కాగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం జోన్ విజయవాడ డివిజన్లో కలుపుతున్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణ ఆదాయం ఆంధ్రాకు వెళ్తుందని, రైల్వే పరంగా మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. ఉద్యోగులు, ప్రయాణికులు, ముఖ్యంగా మధిర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కావునా మధిర రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగేలా కృషి చేయాలని కోరారు. స్పందించిన ఎంపీ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.