తెలంగాణలో ప్రగతి పరుగులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నంగా అభివృద్ధి ఉజ్వలంగా ముందుకు సాగుతోందని అన్నారు.
- పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధి
- రాష్ట్ర సాధన ఉద్యమంలో జిల్లా ప్రజల పాత్ర మరువలేనిది
- తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
- దేశానికి దిక్సూచిగా నిలుద్దాం: భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక
- జాతీయ పతాకం ఆవిష్కరణ.. గౌరవ వందనం స్వీకరణ..
ఖమ్మం, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నంగా అభివృద్ధి ఉజ్వలంగా ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా ఐడీవోసీలో ఆదివారం ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా సీపీ సునీల్‌దత్‌తో కలిసి ఖమ్మం మయూరిసెంటర్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐడీవోసీలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగం ఎన్నటికీ మరువలేదనిదని అన్నారు. అమరుల ఆశయ సాధన కోసం ప్రజలందరూ ముందుకు నడవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు ముగిసి పదకొండో వసంతంలోకి అడుగు పెట్టడం ఒక మైలురాయి అని అభివర్ణించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంటు, మండలి ఎన్నికలను ప్రజల సహకారంతో ప్రశాతంగా నిర్వహించామని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పరిపాలనకు పునరంకితం కావాలని అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శసురభి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలి
ఆవిర్భావ వేడుకల్లో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆకాంక్షించారు. సంక్షేమమే ధ్యేయంగా అందరమూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే దేశానికి దిక్సూచిగా నిలుస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఐడీవోసీలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని అన్నారు. ఎందరో అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి పోరాట చరిత్ర ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు, కార్మికులు, మహిళలు సహా సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై కదిలారని జ్ఞప్తికి తెచ్చారు. ప్రత్యేక తెలంగాణలో ఏర్పడిన మన భద్రాద్రి జిల్లా గిరిజన గిరిజనేతరుల కలయికతో అభివృద్ధిలో ముందుకెళ్తోందని అన్నారు. మన జిల్లా కూడా రాష్ర్టానికి తలమానికం కావాలని ఆకాంక్షించారు. ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాకారులు ఉద్యమాల పాటలు అలరించాయి.
అమరులకు నివాళి..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతిమైదానంలో ఉదయం 8:30 గంటలకు ప్రగతిమైదానంలో అమరుల స్తూపం వద్ద పూలు చల్లి అమరువీరులకు కలెక్టర్ ప్రియాంక నివాళులర్పించారు. ఎందరో త్యాగధనుల ఫలమే నేటి స్వేచ్ఛా వాయువుల తెలంగాణ అని గుర్తుచేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

