Khammam | ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతోత్సవాలు..

ముదిగొండ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ106వ జయంతి ఉత్సవాలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముదిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు తెలియ జేయాలన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బాపూజీ ఆశయం నెరవేరే వరకూ మడమ తిప్పలేదన్నారు.
ప్రాంతమా..? పదవా..? అన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా పదవికి రాజీనామా చేసి పుట్టిన గడ్డ కోసం పోరాడరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణ, వెంకటాపురం సర్పంచ్ అనంతరాములు, ఏఎమ్‌సీ డైరెక్టర్ మల్లయ్య, పీఆర్ ఏఈ వెంకట కృష్ణ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

