కారేపల్లి, నవంబర్ 27 : కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్ధులు ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్ధాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్ధాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్ లిప్టింగ్ పోటీల్లో బి.పల్లవి, వి.ఉదయ్ కిరణ్ ప్రతిభ చూపి జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. వీరు మహారాష్ట్రలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్ధాయి పోటీల్లో బి.పల్లవి, వి.ఉదయ్‌కిరణ్ బంగారు పతకాలు సాధించగా, ఎస్.సాత్విక్, జి.యశస్విని, ఎల్.అమూల్యప్రియ, కె.నిక్షిత, ఎం.భరత్ రజత పతకాలు, పి.విఘ్నేష్ కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను ప్రిన్సిపాల్, పీడీ ముసా మోహినుద్దిన్ అభినందించారు.