Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
Karepalli | ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పురోహితుల కొరత తీవ్రంగా మారుతోంది. స్వల్ప కాలంలో ముగ్గురు పురోహితులు మృతిచెందడం, యువత ఈ వృత్తిలోకి రాకపోవడంతో పూజా కార్యక్రమాలకు పూజారులు దొరకడం కష్టమవుతోంది.
Karepalli | కారేపల్లి, అక్టోబర్ 10: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పురోహితుల కొరత రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. స్వల్ప కాలంలోనే ముగ్గురు పురోహితులు వివిధ అనారోగ్య సమస్యలతో మృతిచెందడంతో పలు గ్రామాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు పూజారులు అందుబాటులో లేక ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వయసు పైబడిన పురోహితులు అనారోగ్య సమస్యలతో సేవలకు దూరమవడం, ఇటీవల పలువురు మృతిచెందడం, కొత్త తరం యువత ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం కొరతకు ప్రధాన కారణాలుగా స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో మండలంలోని అనేక గ్రామాల ప్రజలు అందుబాటులో ఉన్న కొద్దిమంది పురోహితులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
శుభకార్యాలకు ముందస్తు బుకింగ్
వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, వ్రతాలు, పితృకార్యాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పండుగల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు పురోహితుల అవసరం ఉంటుంది. అయితే పూజారుల సంఖ్య తగ్గడంతో ఆయా కార్యక్రమాల కోసం ముందుగానే వారిని సంప్రదించి సమయం ఖరారు చేసుకోవాల్సి వస్తోంది. ఒకే రోజు పలు కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరికీ నిర్ణీత సమయంలో సేవలు అందించడం పురోహితులకూ కష్టంగా మారుతోంది.
గతంలో కుటుంబ వారసత్వంగా పురోహిత వృత్తిని కొనసాగించే సంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం యువత విద్య, ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తవారు రావడం తగ్గిందని పేర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పురోహితుల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణ, ప్రోత్సాహం అవసరం
పురోహితుల కొరతను అధిగమించేందుకు యువతకు వేద, ఆగమ విద్యలో శిక్షణ అందించాలని భక్తులు కోరుతున్నారు. ఈ వృత్తిలోకి వచ్చే వారికి ప్రోత్సాహం కల్పించడంతోపాటు సమీప ప్రాంతాల్లోని పురోహితులతో సమన్వయం చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. తద్వారా పూజా కార్యక్రమాలకు ఆటంకాలు తగ్గి ప్రజలకు సకాలంలో సేవలు అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

