పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కొత్తగూడెంలో నిర్వహించారు.
- భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
- పర్యావరణ దినోత్సవాన కోర్టులో మొక్కలు నాటిన జడ్జి
కొత్తగూడెం టౌన్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వసంత్ పాటిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి, మెజిస్ట్రేట్లు, పీపీలు, పోలీస్ అధికారులు కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా మొక్కలు కాపాడుతాయని, అన్ని రకాల కాలుష్య నివారణకు మొక్కలు దోహదం చేస్తాయని అన్నారు. అందుకని మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు కోటేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి, పీవీడీ లక్ష్మీ, లావణ్య, అబ్దుల్ రెహమాన్, పురుషోత్తంరావు, నిరంజన్‌రావు, కరుణాకర్, శివ్రపసాద్, శ్రీరాములు, మెండు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
విధిగా మొక్కలు నాటాలి :సింగరేణి సీఎండీ బలరాం
కొత్తగూడెం సింగరేణి, జూన్ 5 : భవిష్యత్ తరాల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా బుధవారం హెడ్డాఫీస్లో ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ మేనేజర్ రవికిరణ్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రోత్సహించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సింగరేణి సంస్థ ఖాళీ ప్రదేశాలు, ఓబీ డంపులపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి.. వాటిని పరిరక్షిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 5 కోట్ల మొక్కలతో 14,680 హెక్టార్లను ప్లాంటేషన్ కిందకు తీసుకొచ్చామని, గ్రామస్తులకు 2.25 కోట్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశామని పేర్కొన్నారు.
మొక్కలు నాటిన సీఎండీ
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సీఎండీ బలరాం స్వయంగా మొక్కలు నాటారు. ఇల్లెందు బంగ్లోస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్లతో కలిసి 235 వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. బుధవారం నాటిన మొక్కలతో కలిపి మొత్తం సంస్థవ్యాప్తంగా సీఎండీ 40 ఎకరాల విస్తీర్ణంలో 17,935 మొక్కలు నాటా రు. కార్యక్రమంలో డైరెక్టర్(పా) ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణ, ఆయా సంఘాల నాయకులు మిర్యాల రంగయ్య, త్యాగరాజన్, సింగరేణి సీఎంవోఏఐ వైస్ ప్రెసిడెంట్ ఆపెక్స్ రాజీవ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

