కలెక్టర్ల బాధ్యతల స్వీకరణ
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్‌గా ఉన్న ప్రియాంక బదిలీ అయ్యారు.
- ఖమ్మంలో చార్జ్ తీసుకున్న ముజమ్మిల్ ఖాన్
- భద్రాద్రిలో బాధ్యతలు చేపట్టిన జితేశ్ పాటిల్
- భద్రాచలం ఐటీడీఏ పీవోగానూ అడిషనల్ చార్జ్
మామిళ్లగూడెం/ కొత్తగూడెం అర్బన్/ భద్రాచలం, జూన్ 16: ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్‌గా ఉన్న ప్రియాంక బదిలీ అయ్యారు. వీరి స్థానంలో ఖమ్మానికి ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రికి జితేశ్ వీ పాటిల్ నియమితులయ్యారు. దీంతో ఆదివారం వీరు తమ తమ స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న ముజమ్మిల్ ఖాన్ అక్కడ రిలీవ్ అయి.. ఆదివారం ఉదయం ఖమ్మం ఐడీవోసీకి చేరుకొని ఇక్కడి కలెక్టర్ వీపీ గౌతమ్ నుంచి చార్జ్ తీసుకున్నారు. తొలుత అనంతరం వీపీ గౌతమ్.. ముజమ్మిల్‌ఖాన్‌ను పుష్పగుచ్ఛం అందించారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్‌ను ఖమ్మం జిల్లా అధికారులు మధుసూదన్‌నాయక్, శ్రీనివాస్, సోమశేఖరశర్మ, ఎంఏ గౌస్, గణేష్, ఎల్.రాజేందర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు చెప్పి స్వాగతం పలికారు. అనంతరం నూతన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్‌ను మంత్రి శాలువాతో సత్కరించారు.
భద్రాద్రిలో జితేశ్ పాటిల్..
భద్రాద్రి నూతన కలెక్టర్‌గా జితేశ్ వీ పాటిల్ ఆదివారం ఉదయం 10:15 గంటలకు ఐడీవోసీలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనకు అదనపు కలెక్టర్ విదాయచందన, అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులందరినీ పరిచయం చేసుకున్నారు.
ఇన్చార్జి పీవో గానూ చార్జ్
భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ భద్రాచలం ఐటీడీఏ ఇన్చార్జి పీవోగానూ చార్జ్ తీసుకున్నారు. ఆదివారం భద్రాచలం చేరుకున్న ఆయన.. తొలుత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం పీవో చాంబర్లో ఇన్చార్జి పీవోగా బాధ్యతలు స్వీకరించారు.
సమర్థంగా పనిచేద్దాం: భద్రాద్రి కలెక్టర్
ఇన్చార్జి పీవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమర్థవంతంగా పనిచేద్దామని అన్నారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తాను సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశానని, అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందానని, పూణేలో ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశానని తెలిపారు. తొలుత సంగారెడ్డి ట్రైనీ కలెక్టర్‌గా, తరువాత నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆ తరువాత కామారెడ్డి కలెక్టర్‌గా పనిచేశానని వివరించారు. తన తండ్రి విశ్వనాథ పాటిల్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారని, తన తల్లి రత్నమాల, తన భార్య శారద ఇద్దరూ గృహిణులని, తనకు ఒక కుమారుడు రాఘవ ఉన్నారని వివరించారు. ఇక్కడి అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఈ గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తామనిఅన్నారు. విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అంతకుముందు నూతన కలెక్టర్‌కు భద్రాచలం ఆర్డీవో దామోదరరావు, ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, యూనిట్ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, ఐటీడీఏ అధికారులు మణెమ్మ, తానాజీ, సురేష్‌బాబు, నరిసింహారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

