కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్‌పాషాలు అన్నారు.
- కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ సోమిరెడ్డి
- ఐటీసీలో రిలే దీక్షలు పునః ప్రారంభం
బూర్గంపహాడ్, మార్చి 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్‌పాషాలు అన్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఐటీసీ యాజమాన్యం ఒత్తిడి మేరకు గురువారం రాత్రి భగ్నమైన కార్మికుల రిలే దీక్షలను ఆదివారం తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలతోపాటు 14వ వేతన ఒప్పందం జేఏసీతో కలిసి చేయించాలని, కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ రిలేదీక్షా శిబిరాన్ని టీఎన్టీయూసీ గుర్తింపు సంఘం బాధ్యులు కనకమేడల హరిప్రసాద్, గాదె రామకోటిరెడ్డి, జీవన్‌రెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, తాళ్లగొమ్మూరు సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, సందీపం బాబు, ధర్మపురి వర్ధన, పగడాల రమణమ్మ, గండు ప్రసన్న, స్వరూప, పద్మ, లత, రజిత, భూదేవి, సత్యవతి, మోషేలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షల్లో గల్లా ఉమామహేశ్వరరావు, మర్రి వెంకటరెడ్డి, బోళ్ల సమ్మక్క, గంగ, విజయ, భారతి, వెంకటనరసమ్మ, రమణ, సిరి, అచ్చమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

