అగ్రికల్చర్ హబ్‌గా ‘ఖమ్మం’
ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్‌గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు.
- మార్క్‌ఫెడ్‌లో మొక్కజొన్న మద్దతు ధర రూ.1,962
- ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న ప్రతి రైతుకూ ‘రైతుబంధు’
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- చింతగుర్తి, అల్లిపురంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రఘునాథపాలెం, మే 14: ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్‌గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు. రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో ఆదివారం పర్యటించిన ఆయన.. చింతగుర్తి, అల్లిపురంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.1,962 మద్దతు ధర చెల్లిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతుబంధు పథకం ద్వారా సీజన్‌కు రూ.5 వేల చొప్పున రైతులకు ఏటా ప్రతి ఎకరానికీ రూ.10 వేల పంటల పెట్టుబడిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ఈ పథకం విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న ప్రతి రైతుకూ రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. అయితే ఆ రైతులను ఆదుకునేందుకు బోనకల్లు మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు స్వార్థపూరిత నేతలు రైతులను తప్పుదోవ పెట్టిస్తున్నారని అన్నారు. అలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఆర్డీవో రవీంద్రనాథ్, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, డీసీవో విజయకుమారి, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు, కార్పొరేటర్ రావూరి కరుణ సైదుబాబు, చింతగుర్తి సర్పంచ్ మెంటెం రామారావు, బీఆర్ఎస్ నాయకులు మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్‌రావు, అజ్మీరా వీరూనాయక్, తాతా వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్ యాసా రామారావు, చెరుకూరి ప్రదీప్, సంక్రాంతి నాగేశ్వరరావు, ముప్పారపు ఉపేందర్‌రావు, ముప్పారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

