వరద వదలదే…
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నా.. మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
- భద్రాచలం వద్ద రాత్రి 9.15 నిమిషాలకు మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ముంపు మండలాల ప్రజలకు తప్పని తిప్పలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 26 (నమస్తే తెలంగాణ) : గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నా.. మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోసారి కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతానికి 47 అడుగులు దాటి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా.. శుక్రవారం ఉదయం నుంచి వరద తగ్గుముఖం పట్టింది. మళ్లీ మధ్యాహ్నం నుంచి అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. రాత్రి 9.15నిమిషాలకు అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ఎగువన వర్షాలతోనే..
ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరిలో మళ్లీ వరద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలో కూడా అక్కడక్కడా చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. తాలిపేరు వద్ద కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు పేరూరు వద్ద వరద నీరు భారీగానే చేరుతోంది. దీంతో శనివారం మళ్లీ గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

