రాష్ట్రంలో కక్షపూరిత పాలన
మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
- ఇచ్చిన హామీలను గాలికొదిలి విదేశీ పర్యటనలా?
- కుటుంబ సభ్యులు దావత్ చేసుకుంటే రేవ్ పార్టీలని చిత్రీకరిస్తూ రాద్ధాంతం
- బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కితే అంతకంతకూ ముందుకుపోతాం..
- భద్రాచలంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
భద్రాచలం, అక్టోబర్ 28 : మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలనను గాలికొదిలేసిన మంత్రులు విదేశీ యాత్రల్లో విహరిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందన్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ సంప్రదాయం ప్రకారం దావత్ చేసుకుంటే దానిని రేవ్ పార్టీగా చిత్రీకరించి రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, విద్యార్థులు, ఉద్యోగులు, ఆఖరికి ఏఆర్ పోలీసులు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే వారి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. పాలక ప్రభుత్వాలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే అంతకంతకూ ముందుకు పోతామని రేగా స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ, చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు, ఆకోజు సునీల్‌కుమార్, కణితి రాముడు, కోల రాజు, రేసు లక్ష్మి, రామిరెడ్డి, ప్రకాశ్, గుంజా ఏడుకొండలు, సీతామహాలక్ష్మి, కీసర యువరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

