పామాయిల్ ప్రాభవానికి మసక?
రాష్ట్రంలోనే పామాయిల్ హబ్‌గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని..
- ఓ వైపు జన్యులోపంతో చనిపోతున్న చెట్లు
- మరోవైపు సగటున సగానికిపైగా తగ్గిన దిగుబడి
- ఇంకోవైపు అంతేవేగంగా పడిపోయిన ధరలు
- క్రమంగా నష్టాల్లో కూరుకుపోతున్న రైతులు
- దీర్ఘకాలిక పంటను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
దమ్మపేట, జూలై 12 : రాష్ట్రంలోనే పామాయిల్ హబ్‌గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని.. దిగుబడుల తగ్గుదల, ధరల పతనం, ప్రభుత్వ పట్టింపులేనితనం వంటివన్నీ తమ పాలిట శాపాలుగా మారుతున్నట్లుగా కన్పిస్తోందని పామాయిల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
పామాయిల్ సాగు అంటేనే ‘పేట’ అనేలా..
పామాయిల్ సాగుకు పేరుగాంచి ఇప్పటివరకూ విరాజిల్లుతున్న ప్రాంతం అశ్వారావుపేట. రాష్ట్రం మొత్తంలో సాగవుతున్న 2.03 లక్షల ఎకరాల్లో సుమారు లక్ష ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనివే. అందులోని అశ్వారావుపేట, దమ్మపేట పరిసర ప్రాంతాల్లోని నేలలు ఈ పంట సాగుకు యోగ్యంగా ఉండడం, స్థానికంగానే పరిశ్రమలు ఉండడం ఇక్కడి రైతులకు కలిసొచ్చే అంశం. అన్ని పంటలనూ తోసిరాజని గణనీయస్థాయిలో ఈ ప్రాంతంలో ఈ పంట సాగవుతోంది. దమ్మపేట మండలంలో మొత్తం 51 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే.. 35 వేల ఎకరాల్లోనూ, అశ్వారావుపేట మండలంలో 21 వేల ఎకరాల్లోనూ ఈ పంట సాగవుతోంది. ఈ పంటకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వాలు ఈ పంటను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాయి. దేశ అవసరాల రీత్యా గణనీయస్థాయిలో కేంద్రంలో వివిధ దేశాల నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రం నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన పామాయిల్‌ను ఉత్పత్తి చేసి కేంద్రానికి అందిస్తున్న ఘనత ఇక్కడి పామాయిల్ రైతులది.
పీడిస్తున్న చీడపీడలు.. పడిపోయిన దిగుబడులు
పామాయిల్ సాగు ఎంతవేగంగా విస్తరిస్తుందో అంతే వేగంతో చీడపీడల బెడద కూడా పెరుగుతోంది. ఇంతుకుముందు వరకు ఎకరాకు సగటున 10-12 మెట్రిక్ టన్నుల మధ్య వచ్చే దిగుబడి.. ఇప్పుడు 5-7 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు 2022 జూన్‌లో రూ.23,467 ఉన్న పామాయిల్ గెలల ధర 2024 నాటికి రూ.13,705కు పడిపోవడం రైతులను దెబ్బతీస్తోంది. పైగా పెరుగుతున్న సాగు ఖర్చులను.. ప్రస్తుత దిగుబడులను బేరీజు వేసినప్పుడు తాము మరింత నష్టాల్లోకి కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
దిగుబడులు తగ్గడానికి కారణాలివేనా?
కానీ.. ఇటీవల పామాయిల్ దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, తెల్ల దోమలు వంటివి కారణాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణాలను రైతులు కొట్టిపారేస్తున్నారు. శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి కనీసం తమ పంటలను కూడా పరిశీలించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా పంటకు తెల్లదోమ, గానోడర్మా, స్టమ్ రాట్, రైనోసార్ బీటల్(రెడ్ ఫామ్ ఈవిల్), సంచి పురుగు(బ్యాగ్ వార్మ్)లు ఆశిస్తుండడం.. నివారణకు ప్రభుత్వం మందులు సరఫరా చేయకపోవడం వంటివి కూడా దిగుబడుల తగ్గుదలకు కారణంగా ఉన్నాయి. అయితే, గతంలో విదేశాల నుంచి తెచ్చి ఇక్కడి రైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన మొక్కల్లో అత్యధికంగా హాఫ్ టైప్(జన్యు లోపాలతో కూడిన) మొక్కలు కన్పిస్తున్నాయి. చెట్లు పెరిగి పంట దశకు చేరుకుంటున్న సమయంలో అవి జన్యు లోపంతో చనిపోతుడడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
రైతులను ఆదుకోవాలి..
పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా శాస్త్రవేత్తలను నియమించాలి. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సీఎస్ఆర్ నిధులను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రానికి కేటాయించాలి. వాటిని జీవ నియంత్రణ మందులు, జీవ నియంత్రణ ఎరువుల తయారీకి కేటాయించి రైతులను ఆదుకోవాలి.
-తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, ఆయిల్‌పామ్ గ్రోవర్స్ సొసైటీ అశ్వారావుపేట జోన్ అధ్యక్షుడు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

