వైరా టౌన్, అక్టోబర్ 19 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తొలుత గండగలపాడు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వైరాలోని 2, 3, 5, 6, 8, 10, 12, 14 వార్డుల్లో చెక్కులను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికైన ఖర్చులో ప్రభుత్వం ఎంతోకొంత ఇవ్వడం.. ఆసరాగా ఉంటుందని అన్నారు. రూ.2,96,500 విలువైన 14 చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, దార్న రాజశేఖర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున్రావు, నాయకులు మచ్చా బుజ్జి, రాయల పుల్లయ్య, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఆలయ చైర్మన్ పోలా శ్రీనివాసరావు, పట్టణ నాయకులు మోటపోతుల సురేశ్, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, ఫణితి సైదులు, కర్నాటి హనుమంతరావు, కౌన్సిలర్లు కర్నాటి నందిని, కన్నెగంటి సునీత, ఏదునూరి పద్మజ, దారెల్లి కోటయ్య, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడు జవ్వాజి నాగరాజు, సర్పంచ్ పరికిపల్లి శ్రీనివాసరావు, గోపాలరావు, బీక్యా తదితరులు పాల్గొన్నారు.