కారేపల్లి సెప్టెంబర్ 29 : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు జన్మదినం సందర్భంగా మద్దెబోయిన సత్యనారాయణ ఆధ్వర్యంలో గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్యా ధనలక్ష్మి, కోటేశ్వరరావు, ఉన్నం ఉమారాణి, కెళ్లోత్ సూర్యకుమార్, నన్నెబోయిన వెంకటేశ్వర్లు, మేకల చిన్న నారాయణ, శేఖర్, ఉపేందర్, సురేష్, షకీల్, జంపయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.