కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరకు భక్తజనం పోటెత్తారు. బుధవారం వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని...
కారేపల్లి, అక్టోబర్ 21 : సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరకు భక్తజనం పోటెత్తారు. బుధవారం వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, జాతర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు.

కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
కోట మైసమ్మ తల్లిపై భక్తులకు ఉన్న విశ్వాసం, నమ్మకానికి జాతరకు తరలివచ్చిన జనసందోహం నిదర్శనంగా నిలిచింది. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏసీపీ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి జాతర ప్రాంగణాన్ని సందర్శించి పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధుల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రద్దీని క్రమబద్ధీకరిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. జాతర మరో రెండు రోజులపాటు కొనసాగనుంది.

కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

