పదేళ్ల ప్రగతి ఆవిష్కృతమవ్వాలి
తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
- భద్రాద్రి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాలి
- రాష్ట్రంలో నాటి దుస్థితిని, నేటి ప్రగతిని ప్రజలకు వివరించాలి
- గ్రామసభల్లో ‘పల్లె ప్రగతి’ నివేదికలు ప్రదర్శించాలి
- సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా
సారపాక, మే 30 : తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మణుగూరు మండలం గుట్టమల్లారంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పల్లెపల్లెనా నాటి దుస్థితి… నేటి ప్రగతిని ప్రజలకు వివరించడంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సంఘాలు, గ్రామాల్లో మహిళలను భాగస్వాములు చేయాలని, తాగు, సాగునీరు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రదర్శనలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను కార్యక్రమాలను దండోరాలు వేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు.
గ్రామసభలు నిర్వహించి పల్లె, పట్టణ ప్రగతి నివేదికలను ఏర్పాటు చేసి ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో 21 రోజుల పాటు నిర్వహించి, ఉత్సవాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వాములు చేసి తెలంగాణ ప్రగతిని దేశమంతా చాటాలన్నదే సీఎం కేసీఆర్ ఆయన లక్ష్యమని అధికారులు, ప్రజాప్రతినిధులకు గుర్తుచేశారు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పినపాక నియోజకవర్గంతోపాటూ భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే దశాబ్ధి ఉత్సవాలు రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో ఏడీఏ తాతారావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, సీఐలు ముత్యం రమేశ్, ఎల్.రవీందర్, చెన్నూరి శ్రీనివాస్, ఇతరశాఖల అధికారులతోపాటు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఆత్మకమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

