భవితవ్యం తేలేది నేడే..
లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 4న ఓట్లను లెక్కించనున్నారు.
- ఉదయం 8కి ‘లోక్‌సభ’ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- సాయంత్రానికి వెలువడనున్న ‘ఖమ్మం’ ఫలితం
- ‘శ్రీచైతన్య’లో భారీ భద్రత మధ్య ఓట్ల కౌంటింగ్
- ఏర్పాట్లు పరిశీలించిన ఆర్వో, ఖమ్మం కలెక్టర్, సీపీ
- ఫలితాలపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఖమ్మం, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 4న ఓట్లను లెక్కించనున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఈవీఎంలను అధికారులు భారీ భద్రత నడుమ ఖమ్మం రూరల్ మండలం శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఉంచిన విషయం విదితమే. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఒకే టేబుల్‌పై లెక్కించనున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని 1,896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను 115 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను ఖమ్మం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్‌దత్ సోమవారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరితోపాటు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారు. మంగళవారం నాటి ఓట్ల లెక్కింపు కోసం సుమారు 1,500 మంది అధికారులు, ఉద్యోగులు విధుల్లో పాల్గొననున్నారు.
36 మంది అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని ఓట్లో..
ఖమ్మం లోక్‌సభ స్థానంలో 36 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా.. ఓటర్లు ఎవరికి ఎన్ని ఓట్లు వేశారో అనే విషయం మంగళవారం సాయంత్రంలోగా తేలనుంది. అయితే ఓట్ల లెక్కింపు కోసం అభ్యర్థుల తరఫున 565 మంది ఏజెంట్లు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో 16,31,039 ఓట్లకు గాను 12,41,135 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 17,645, సర్వీస్ ఓట్లు 430 పోలయ్యాయి.
రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ఎల్ఈడీ తెరలు..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వేస్టేషన్, వైరా, మధిర బస్టాండ్లలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో లెక్కింపు పూర్తి కాగానే ప్రతీ రౌండ్ ఫలితాన్ని ఎప్పటికప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలను అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
భారీ భద్రతా ఏర్పాట్లు..
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ఖమ్మం సీపీ సునీల్‌దత్ ఆధ్వర్యలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను ఉంచారు. 250 మంది పోలీస్ సిబ్బందితోపాటు మూడు స్పెషల్ పార్టీల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సిబ్బంది మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలనే అంశాన్ని 5 గంటలకు అధికారులు నిర్ణయిస్తారు. లెక్కింపు గోప్యతపై కౌంటింగ్ సిబ్బందితో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించనున్నారు.
ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం..
తొలుత అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూములను తెరవనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రం 18 టేబుళ్లను అమర్చారు. మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున అమర్చారు. ఆయా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను బట్టి ఎన్ని రౌండ్లు ఉంటాయో నిర్ణయించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారి కాకుండా ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారులను నియమించారు. వీరి సమక్షంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం సాయంత్రం 4 గంటలలోపు ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

