భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.
భద్రాచలం, ఏప్రిల్ 13 : భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవ వేడుకలను తిలకించడానికి వివిధ రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు.
భక్తులు కల్యాణ మండపం వద్దకు నేరుగా వచ్చేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, రూట్ మ్యాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మండపం వద్ద వివిధ సెక్టార్లలో నియమించిన ప్రత్యేకాధికారులు ఉదయం 8 గంటలకల్లా వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సెక్టార్‌కు ఇద్దరు శానిటేషన్ సిబ్బందిని ఉంచాలని, వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో మంచినీరు, టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, సమాచార, వైద్య శాఖకు సంబంధించిన స్టాళ్లు, హెల్ప్ డెస్క్‌లకు సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 25 లొకేషన్ల నుంచి నడవలేని భక్తులకు ప్రత్యేక వలంటీర్ల ద్వారా వీల్‌చైర్స్ సౌకర్యం కల్పించాలన్నారు.
గోదావరి వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. గోదావరి వద్దకు వెళ్లలేని భక్తుల కోసం 200 పంపులు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఎస్సీని ఆదేశించారు. ముఖ్యంగా కల్యాణ మండపం, భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా చెత్తను తొలగించాలని ఈవోను ఆదేశించారు. ప్రసాదం కోసం 60 కౌంటర్లు, తలంబ్రాల కోసం 120 కౌంటర్లు, 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
కల్యాణం పూర్తయిన తర్వాత భక్తులు స్వామివారి ప్రసాదాలు తీసుకొని సురక్షితంగా వారివారి గమ్యాలకు చేరేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. అధికారులు, వారి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఆర్డీవో దామోదర్‌రావు, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఎస్డీసీ సుమ, డీఏవో బాబురావు, తహసీల్దార్ శ్రీనివాస్, జీపీ ఈవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

