అర్హులకే రుణమాఫీ వర్తింపు : ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం వర్తించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
మామిళ్లగూడెం, జూలై 18 : జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం వర్తించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో మొదటి విడతగా రూ.లక్షలోపు పంట రుణాలు ఉన్న 57,857 మంది రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరుతుందన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2లక్షల రుణమాఫీ పథకం అమలవుతుందని, దీనిపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం జమ చేసిన వెంటనే బ్యాంకులు లోన్ ఖాతా నుంచి సంబంధిత సొమ్మును రైతుల సేవింగ్స్ ఖాతాలోకి బదలాయింపు చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణాధికారి, వ్యవసాయాధికారి వారీగా ఫిర్యాదుల పరిషార కేంద్రాల ఏర్పాటు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, జిల్లా ఉద్యానవన అధికారి వెంకటరమణ, ఇన్చార్జి ఎల్డీఎం శివకుమార్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

