మది నిండుగ.. ప్రభువు ఉండగ.. అందరికీ పండుగ
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
రఘునాథపాలెం, డిసెంబర్ 25: ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఆయా చర్చీలు ఫాదర్లు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తుబోధనల సారాన్ని గుర్తుచేశారు. మానవతా విలువలు ప్రేమ, సహనం, కరుణవంటివన్నీ క్రీస్తు మనుషులందరికీ బోధించారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడిచేందుకు క్రీస్తు శిక్ష అనుభవించారని జ్ఞప్తికి తెచ్చారు.
పెనుబల్లి, డిసెంబర్ 25 : ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ పండుగ సందేశమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం టేకులపల్లి గ్రామ చర్చిలో మిఠాయిలు పంచి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం రూరల్, డిసెంబర్ 25: పల్లెగూడెం గ్రామంలో ఉన్న కర్చేల్ ప్రేయర్ టవర్ చర్చిలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరి దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు.
బోనకల్లు, డిసెంబర్ 25: గోవిందాపురం-ఎ గ్రామంలోని ఆర్సీఎం చర్చికి భాగం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాగం రాజేశ్ ఆంప్లిఫైర్, సౌండ్ సిస్టంను సోమవారం అందించారు.
కూసుమంచి, డిసెంబర్ 25: మండలంలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సంఘ కాపరులు, చర్చి ఫాదర్లులు అర్ధరాత్రి వరకు ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 25: నేలకొండపల్లి మండలవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. పాస్టర్లు కేక్‌లు కట్ చేశారు.
తిరుమలాయపాలెం, డిసెంబర్ 25: మండలవ్యాప్తంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కల్లూరు, డిసెంబర్ 25: వివిధ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలు జరిపారు. శాంతినగర్ చర్చిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రార్థన చేశారు.
కారేపల్లి, డిసెంబర్ 25: మండలవ్యాప్తంగా వేడుకలు జరిగాయి.
సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 25: పట్టణంలోని పరిశుధ్ధ జేమ్స్ చర్చి వద్ద ఫాదర్లు, క్రైస్తవులకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వీట్ బాక్సులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
వేంసూరు, డిసెంబర్ 25: మండలంలోని చర్చీల్లో వేడుకలు జరిగాయి. పాస్టర్లు కేకులు కట్ చేశారు.
చింతకాని, డిసెంబర్ 25: మండలవ్యాప్తంగా ఆదివారం రాత్రి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కొణిజర్ల, డిసెంబర్25 : ఆదివారం అర్థరాత్రి నుంచి గ్రామాల్లోని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తల్లాడ, డిసెంబర్ 25: మండలంలోని ఆయా చర్చిల ఫాదర్లకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వీట్లు పంపిణీ చేశారు.
వైరా రూరల్, డిసెంబర్ 25: మండలంలోని ముసలిమడుగు, లింగన్నపలెం గ్రామాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ కేక్ కట్ చేశారు.
ఎర్రుపాలెం, డిసెంబర్ 25: ఆదివారం అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ఫాదర్లు, పాస్టర్లు, మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

