కాలువ పనులను వేగిరం చేయాలి
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.
అన్నపురెడ్డిపల్లి, జూలై 9: సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. గుంపెన గ్రామ శివారులో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కాలువ వంతెన, కాలువ నిర్మాణ పనులను భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. పనులను వేగవంతంగా చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు సీఈ ఏ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ అర్జున్, డీఈఈ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

