పిడుగుపాటుతోనే అగ్ని ప్రమాదం
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు.
- యూనిట్-1 వద్ద రూ.25 కోట్ల వరకు నష్టం ధ్రువీకరించిన బీటీపీఎస్ డైరెక్టర్ లక్ష్మయ్య
మణుగూరు టౌన్, జూన్ 30 : భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, విద్యుత్ సౌధా ఎస్ఈ రత్నాకర్‌లు ఆదివారం బీటీపీఎస్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం డైరెక్టర్ లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ..పిడుగుపాటు ప్రభావం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ పిడుగు పడినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో గుర్తించామని అన్నారు. దీనివల్ల రూ.20 కోట్ల రూ.25 కోట్ల వరకూ నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం వల్ల యూనిట్-1లో విద్యుత్ ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందన్నారు. కాలిపోయిన జనరేటర్, యంత్ర సామగ్రి లభ్యత ఆధారంగా మాత్రమే ఈ యూనిట్ పునరుద్ధరణ అంశంలో స్పష్టత వస్తుందని తెలిపారు.
270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం..
బీటీపీఎస్ యూనిట్-1 జీటీ (జనరేటర్ ట్రాన్స్ఫార్మర్) వద్ద పిడుగుపడడంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లయింది. అయితే దీని పునరుద్ధరణకు 40 – 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

