వైరా టౌన్, అక్టోబర్ 13: బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని బీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్‌లాల్ అన్నారు. వైరాలోని పరుచూరి గార్డెన్స్‌లో శుక్రవారం పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు సేవకుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, బీఆర్ఎస్ గెలుపునకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.
సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. నాయకులు, ప్రజాప్రతి నిధులు ముళ్లపాటి సీతారాములు, కట్టా కృష్ణార్జునరావు, నంబూరి కనకదుర్గ, పసుపులేటి మోహన్‌రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, నాగేశ్వరరావు, దారేల్లి కోటయ్య, సునీత, నాగేశ్వరరావు, ఇమ్మడి రామారావు, సాదం రామారావు, భట్ట బద్రయ్య, రామారావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, సక్కుభాయి, సత్యంబాబు, సురేష్, బీబా, ప్రసాద్, కిలారి శ్రీనివాసరావు, చింతనిప్పు మురళి, వనమా చిన్న, మాదినేని ప్రసాద్, ఏదునూరి శ్రీనివాసరావు, మేడూరి రామారావు, మరికంటి శివ, లగడపాటి ప్రభాకర్, మేదరమెట్ల రాము, చల్లా సతీష్, ఏనుగంటి కృష్ణ, శివ, కామినేని శ్రీనివాసరావు, దొంతబోయిన గోపి, ఆదూరి ప్రేమ్‌కుమార్, శివ పాల్గొన్నారు.