వరదల్లో నేనే.. ఆపదలో నేనే..
ఖమ్మం ప్రజలు ఆపదలో ఉన్న వేళ తానే అండగా ఉన్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. చివరికి ఖమ్మంలో వర్షాలు వచ్చినా, మున్నేటి వరదలు వచ్చినా తానే ఎదురెళ్లి నగర ప్రజలను ఒడ్డుకుచేర్చానని గుర్తుచేశారు.
- మరి ఖమ్మం ప్రజల కష్టాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఎక్కడ?
- గొంగళిపురుగులా ఉన్న ఖమ్మాన్ని సీతాకోకచిలుకలా మార్చా..
- హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దా..
- మరింత అభివృద్ధి కోసం మరోసారి నన్ను దీవించి గెలిపించండి
- ఖమ్మం ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, నవంబర్ 27: ఖమ్మం ప్రజలు ఆపదలో ఉన్న వేళ తానే అండగా ఉన్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. చివరికి ఖమ్మంలో వర్షాలు వచ్చినా, మున్నేటి వరదలు వచ్చినా తానే ఎదురెళ్లి నగర ప్రజలను ఒడ్డుకుచేర్చానని గుర్తుచేశారు. మరి ఎన్నో గొప్ప పనులు చేశానంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. ఖమ్మం ప్రజలు కష్టాల్లో ఉన్న వేళ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కరోనా వేళ సాయమందించారో, వరదల వేళ వచ్చి బురదలో దిగి భుజం అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 23, 43, 46, 48, 53, 57 డివిజన్లలో రోడ్‌షోలలో మాట్లాడారు. ఈ ఎన్నికలు ఖమ్మం భవిష్యత్‌కి సంబంధించిన ఎన్నికలని అన్నారు. వాటి ఫలితాలు మన తలరాతను నిర్దేశిస్తాయని అన్నారు. అందుకని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో ఖమ్మాన్ని తీర్చిదిద్దానని అన్నారు. ఖమ్మం అభివృద్ధి గురించి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పారని గుర్తుచేశారు.
ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో చెప్పేందుకు ఇంతకుమించిన నిదర్శనం ఏమీ ఉండదని అన్నారు. 40 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న తుమ్మల.. మొన్న వచ్చిన మున్నేరు వరదల్లో ఖమ్మం ప్రజలను కనీసం పలుకరించిన పాపనపోలేదని విమర్శించారు. ఖమ్మం మూడో పట్టణాన్ని మున్నేరు వరదలు చుట్టిముట్టిన వేళ అర్ధరాత్రిన వెళ్లి ప్రజలను కాపాడుకున్నానని అన్నారు. అంతటితోనే ఆగిపోకుండా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రిటైనింగ్ వాల్ మంజూరు చేయించానని గుర్తుచేశారు. గతంలో గొంగళిపురుగులా ఉన్న ఖమ్మం నగరాన్ని తాను నేడు సీతాకోకచిలుకలా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. ఎక్కడా దిక్కులేక ఇప్పుడు ఖమ్మమొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. ఈ అభివృద్ధి అతనే చేసినట్లుగా చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ మరింత అభివృద్ధి కోసం మరోసారి తనను దీవించి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పడాల నాగరాజు, కన్నం వైష్ణవీ ప్రసన్నకృష్ణ, తోట గోవిందమ్మ రామారావు, పగడాల శ్రీవిద్య, మెంతుల శ్రీశైలం, కనకం భద్రయ్య, విజయ్, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

