మనసుదోచే అందాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెరసాని, భద్రాచలం, పర్ణశాల, బొగత జలపాతం, గుబ్బలమంగి, పెద్దమ్మతల్లి, సమ్మక్క సారలమ్మ తదితర ప్రాంతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి.
- మన భద్రాద్రిలో
- విహార విడిదిగా కొత్తగూడెం జిల్లా
- ఆనందం, ఆహ్లాదాన్ని పంచుతున్న పర్యాటక ప్రాంతాలు
- సెలవుల్లో సందడిగా ప్రకృతి రమణీయ స్థలాలు
- మనస్సును కట్టిపడేస్తున్న కొండకోన అందాలు
- బోట్ షికారు.. పెరిగిన హుషారు
- కిన్నెరసాని, కొత్తగూడెం సెంట్రల్ పార్కులో సందడే సందడి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెరసాని, భద్రాచలం, పర్ణశాల, బొగత జలపాతం, గుబ్బలమంగి, పెద్దమ్మతల్లి, సమ్మక్క సారలమ్మ తదితర ప్రాంతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల విహారయాత్రలకు పిక్నిక్ స్పాట్లు కూడా ఉన్నాయి.
బోట్ షికారుకు పెరిగిన ఆదరణ
అన్ని ప్రాంతాల్లో నదులు, వాగులు ఉండడం అరుదు. నీటిలో బోటు షికారు చేస్తే ఆనందంగా ఉంటుంది. అలాంటి బోటు షికారు మన జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలోని కిన్నెరసాని ప్రాంతంలో ఉంది. డ్యాంలో జోరునపారే నీటి సెలయేరు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఉన్న పాపికొండల్లో గోదావరి నదిలో లాంచీ ప్రయాణం పర్యాటకులకు విడిదిగా మారింది. పాపికొండల్లో విహారం ఎంతో ఆనందాన్ని మిగుల్చుతుంది. వెదురుతో చేసిన బొమ్మలు, పూల మందిరాలు, కొండకోన అందాలు ప్రకృతి ప్రేమికుల మనస్సును పులకింపజేస్తాయి. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో సెంట్రల్ పార్కు పర్యాటకులకు విడిదిగా మారింది. సెలవులు, ఆదివారాలు వస్తే పిల్లాపాపలతో అర్బన్ పార్కుకు వచ్చి ఆటవిడుపుగా ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ సెంట్రల్ పార్కు ప్రస్తుతం కొత్త అందాలతో రూపుదిద్దుకుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి సెలవుల వరకు విహారాలకు బాగా డిమాండ్ ఉంటుంది. వచ్చేవారం నుంచి పాపికొండల విహారం యాత్రను టూరిజంశాఖ అధికారికంగా ప్రారంభిస్తున్నది. ఇందుకోసం తెలంగాణ టూరిజంశాఖ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నది.

‘బడ్జెట్ హోటల్’ పూర్తయితే మరింత శోభ
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా జిల్లాకేంద్రంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్న ‘బడ్జెట్ హోటల్’తోపాటు కిన్నెరసానిలో అద్దాల మేడకు రూ.12 కోట్లు నిధులు మంజూరు చేసింది. మరో ఆరునెలల్లో పనులు పూర్తికానున్నాయి. ఇవి పూర్తయితే పర్యాటకుల తాకిడి జిల్లా కేంద్రానికి మరింత పెరుగనున్నది. అతివిశాలమైన గదులతో బడ్జెట్ హోటల్ నిర్మాణం జరుగుతున్నది.
పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తా
బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలో టూరిజం హోటల్ కూడా పూర్తి అవుతుంది. సెంట్రల్‌పార్కు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచుతున్నది. కిన్నెరసానిలో బోటు షికారు చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని కొండకోనలతో నిండి ఉంది. పల్లె ప్రకృతి వనాలు పచ్చందాలు తెచ్చిపెట్టాయి. ప్రతి పంచాయతీలో పల్లె పార్కులు అందుబాటులో ఉన్నాయి. చెరువులు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. రుద్రంపూర్‌లో ఏకో పార్కు మంచి వాతావరణంలో ఉంది.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే

కొత్తగూడెం : సెంట్రల్‌పార్కు, సింగభూపాలెం, కిన్నెరసాని బోటింగ్, అద్దాలమేడ, జింకలపార్కు
బూర్గంపాడు : వేలేరు వద్ద పాములేరు, సీతారామ ప్రాజెక్టు కాలువలు
భద్రాచలం : భద్రాచలం కరకట్ట, పర్ణశాల, గుబ్బలమంగి, దుమ్ముగూడెం ప్రాజెక్టు
చర్ల : తాలిపేరు
ఇల్లెందు : ఏడుపాయలవాగు, జలపాతం
అశ్వారావుపేట : మూకమామిడి, దమ్మపేట పామాయిల్ తోటలు
చండ్రుగొండ : వెంగళరావు ప్రాజెక్టు, గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం
మణుగూరు : సమ్మక్క సారలమ్మ గద్దెలు, జలపాతం, అశ్వాపురం భారజలం ప్లాంట్
వాజేడు : బొగత జలపాతం
జిల్లావ్యాప్తంగా ఉన్న పల్లెప్రకృతి వనాలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

