‘ధరణి’ సహా అన్ని దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ధరణి సహా అన్ని దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. వివిధ అంశాలపై ఆమె శుక్రవారం ఐడీవోసీ సేమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.
- ముఖ్యమంత్రి ప్రజావాణి దరఖాస్తులపై నివేదిక ఇవ్వాలి
- అధికారుల సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ధరణి సహా అన్ని దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. వివిధ అంశాలపై ఆమె శుక్రవారం ఐడీవోసీ సేమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ధరణి ఫిర్యాదులను కూలంకశంగా పరిశీలించిన తర్వాత మాత్రమే సిఫారసు చేయాలన్నారు. దరఖాస్తులన్నింటినీ వారం రోజుల్లో పరిష్కరించాలని, ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని ఆదేశించారు.
తిరస్కరించిన వాటిని కారణాలతో చెక్ లిస్టులో నమోదు చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మీ సేవా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ది పనులు, ప్రాజెక్టులకు భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రజావాణి దరఖాస్తులను రెండు రోజుల్లోగా పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.22.69 కోట్లు
యూడైస్‌లో గుర్తించిన 697 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22.69 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పాఠశాలల హెచ్ఎంలు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, డీఆర్డీవోతో ఇతర ప్రభుత్వశాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.
18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్: కలెక్టర్
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 15: ఈ నెల 18 నుంచి జిల్లాలోని 73 కేంద్రాల్లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

