రైతుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీవోసీ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.
- రుణమాఫీ నిధులను ఇతర రుణాలకు మళ్లించొద్దు
- బ్యాంకర్ల సమీక్షలో భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భధ్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీవోసీ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన లబ్ధిదారులందరికీ తమ బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని తెలిపారు. అన్ని బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులను కారణాలు చూపుతూ నిలుపుదల చేయొద్దని ఆదేశించారు.
రుణమాఫీ కింద భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. 2018, డిసెంబర్ 12వ తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 2023, డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పంట రుణమాఫీపై సందేహాలు, ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా హెల్ప్ డెస్క్ నంబర్లను ఏర్పాటు చేశామని, రాజేశ్వర్ (జూనియర్ అసిస్టెంట్) 7416442798, అశోక్‌కుమార్ (వ్యవసాయాధికారి) 9550226672 నంబర్లలో సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంరెడ్డి, అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

