చింతకాని: మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి మహళలకు బతుకమ్మచీరెలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని 26గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, పాలకమండళ్ల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ శనివారం ప్రారంభం అయ్యింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి సుభద్ర, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ కిశోర్, సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతుబంధుసమితి నాయకులు కిలారు మనోహర్, మంకెన రమేశ్, వైస్‌ఎంపీపీ గురిజాల హనుమంతరావు, ఎంపీటీసీ మేకనబోయిన రాంబాబు, కార్యదర్శి బోడ్డు వెంకట్రామారావు, అధికారులు, 26 గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులు, అంగన్వాడీలు, కార్యదర్శులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.