ప్రణాళికాయుతంగా అభివృద్ధి పనులు : జడ్పీ సీఈఓ నాగలక్ష్మి
చుంచుపల్లి మండలంలో జలసిరి, ఉపాధి హామీ పనుల అమలుపై జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు,ర వీబీ జీ రామ్ జీ సిబ్బందితో సమావేశమై పనుల గుర్తింపు, గ్రామ పంచాయతీ భవనాల...
చుంచుపల్లి, నవంబర్ 13 : చుంచుపల్లి మండలంలో జలసిరి, ఉపాధి హామీ పనుల అమలుపై జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు,ర వీబీ జీ రామ్ జీ సిబ్బందితో సమావేశమై పనుల గుర్తింపు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, ఉపాధి కూలీల సంఖ్య పెంపుపై సూచనలు చేశారు. అనంతరం పెనగడప గ్రామంలో పర్యటించి ఇంకుడు గుంతలు, చెరువులు, కుంటలు, కమ్యూనిటీ సోక్పిట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి మార్కింగ్ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్. సుభాషిణి, ఏపీఓ రంగా, సర్పంచ్ కారం సీతారాములు, టెక్నికల్ అసిస్టెంట్ అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

