భార్యను వేధిస్తున్నాడనే అనుమానంతో యువకుడి హత్య
అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
– నిందితుడి అరెస్టు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం, జూన్ 23 : అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన సాధన శివాజీ భార్యను నాగరాజు వెంటపడి వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు తెలిపింది. ఈ నేపథ్యంలో శివాజీ, అతని భార్య నాగేశ్వరి, చెల్లెలు పరిశుద్ధ అలియాస్ ప్రమీల కలిసి నాగరాజును హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 10.20 గంటలకు శివాజీ నాగరాజు ఇంటికి వెళ్లి, ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై కత్తితో దాడి చేసి హత్య చేసి పరారైనట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడు తన ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో వన్‌టౌన్ సీఐ ఎం.కరుణాకర్ సిబ్బందితో కలిసి శివాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఘటన సమయంలో ధరించిన టీ-షర్టును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ కరుణాకర్, టూ టౌన్ ఎస్ఐలు రాజశేఖర్, జీవన్‌రాజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

