కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు : మచ్చా వెంకటేశ్వర్లు
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల పొట్ట కొట్టే నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం బాధాకరమని అన్నారు. సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి లేదని, పేదల నడ్డి విరిచే కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తుందని విమర్శించారు.
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను బేషరతుగా తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి బి.మధు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కీ బాలరాజు, అన్నవారపు సత్యనారాయణ, భూక్యా రమేష్, కొబల్, నాయకులు నందిపటి రమేష్, రాం చరణ్, ముత్తేష్, రఘు, రాములు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

